మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని కేసీఆర్ పట్టించుకోలేదు : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్ లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదేళ్లు కేసీఆర్ గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆత్రం సుగుణకు ప్రజల ఆశీర్వాదం కావాలి. అడవి బిడ్డలకు మంత్రి సీతక్క అండగా నిలబడిందని తెలిపారు. బీజేపీ ఎంపీని గెలిపిస్తే.. కేంద్రం ఇచ్చింది ఏం లేదన్నారు. ఆదిలాబాద్ ఎంపీ మొదటిసారి కాంగ్రెస్ ఓ మహిళకు సీటు ఇచ్చిందని.. ఆమెను గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేశామని.. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని.. పదేళ్లు కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. 400 సీట్లు వస్తే.. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది. గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు టికెట్ ఇవ్వకుండా బీజేపీ అవమానించింది అన్నారు. ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం ఏంటో చూపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

Spread the love