ముగిసిన ల‌క్నో బ్యాటింగ్.. రాజ‌స్థాన్ టార్గెట్?

నవతెలంగాణ – హైదరాబాద్:  టేబుల్ టాప‌ర్‌తో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అనూహ్యంగా పుంజుకుంది. ఆదిలోనే రెండు వికెట్లు ప‌డినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(63), దీపక్ హుడా(50)లు అర్ద శ‌త‌కాలతో చెల‌రేగారు. చివ‌ర్లో ఆయుష్ బ‌దొని(18 నాటౌట్), కృనాల్ పాండ్యా(15 నాటౌట్)లు పోరాడ‌డంతో 5 వికెట్ల న‌ష్టానికి 196 ర‌న్స్ చేసింది. రాజ‌స్థాన్ పేస‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ‌(2/31) రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. టాస్ ఓడిన ల‌క్నోను ప‌వ‌ర్ ప్లేలో రాజ‌స్థాన్ పేస‌ర్లు వ‌ణికించారు. ఫామ్‌లో ఉన్న క్వింట‌న్ డికాక్‌(8)ను బౌల్ట్ మూడో బంతికే బౌల్డ్ చేయ‌గా.. గ‌త మ్యాచ్ సెంచ‌రీ హీరో మార్క‌స్ స్టోయినిస్‌(0)ను సందీప్ శ‌ర్మ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు. 11 ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డిన ల‌క్నో కుప్ప‌కూల‌కుండా రాహుల్, హుడాలు అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డారు. కుద‌రుకున్నాక ఇద్ద‌రూ భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

Spread the love