మేధావి మౌనం వీడు

– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ-హైదరాబాద్ : మేధావులు మౌనం వీడి ఓటు హక్కు వినియోగించుకోవాలని కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు బి.సరోజని రామారావు శోభా రాణి, గృహిణి పూర్ణ కుమారి,జి.కృష్ణవేణీ అన్నారు. శుక్ర వారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ కూరగాయలను ఏరి.. ఏరి కొంటాం కదా మరి 5ఏళ్ళు పాలించే నాయకుడుకు ఓటు వేసే టప్పుడు ఆలోచించి వేయాలన్నారు .మేధావులు 40 నుంచి 50 శాతం మంది ఓటు వినియోగించు కోవడం లేదని ఒక సర్వే లో తేలిందన్నారు.సెలవని చాలా మంది కాలక్షేపం చేస్తూ ఓటు వేయకుండా వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఓటు వేస్తేనే కదా దేశం మారుతుంది,అవినీతి అంతమవ్వు తుందన్నారు … ఓటుకు విలువ ఇస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ విన్నవిస్తున్నామన్నారు. మేధావులు కదలివస్తేనే మంచి వారిని ఎన్నుకోగలమన్నారు.మీరు ఓటు వేయడమే కాకుండా మీ ప్రక్కవారిని ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురు సరోజని రామారావు, శోభా రాణి, పూర్ణ కుమారి , జి.కృష్ణవేణి పాల్గొన్నారు.

Spread the love