శ్రీలంక ఆల్‌‌రౌండర్‌‌‌‌ పై సస్పెన్షన్‌‌..

నవతెలంగాణ – దుబాయ్‌‌:  టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్‌‌ నుంచి వెనక్కి వచ్చి బంగ్లాదేశ్‌‌తో సిరీస్‌‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న  శ్రీలంక ఆల్‌‌రౌండర్‌‌‌‌ వానిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. అతనిపై రెండు టెస్టుల సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల బంగ్లాతో మూడో వన్డేలో ఫీల్డ్‌‌ అంపైర్‌‌‌‌తో దురుసుగా వ్యవహరించినందుకు అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు జమయ్యాయి.  మొత్తంగా అతని డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. దాంతో నిబంధనల మేరకు ఐసీసీ వాటిని నాలుగు సస్పెన్షన్‌‌ పాయింట్లుగా మార్చింది. రాబోయే రెండు టెస్టుల్లో పాల్గొనకుండా బ్యాన్‌‌ చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్‌‌ టీమ్‌‌కు దూరం కానున్న  హసరంగ  ఐపీఎల్‌‌ 17వ సీజన్‌లో   సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు తొలి మ్యాచ్‌‌ నుంచే అందుబాటులోకి రానున్నాడు.

Spread the love