టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. చండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 15 నెలల తర్వాత క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. సొంతగడ్డపై ఆడుతుండడం పంజాబ్ కు కలిసి రానుంది. మరోవైపు ఢిల్లీ వార్నర్, మార్ష్ , నోకియా, పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు బోణీ చేస్తారో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్

Spread the love