ఐటిలో మనమే మేటి..

– ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న ఐటి రంగం
– నిజామాబాద్ లో 50 కోట్లతో ఐటి హబ్ నిర్మాణం
– ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటి హబ్
– స్టార్టప్ కేంద్రంగా నిజామాబాద్ ఐటి హబ్
– అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం
– నిజామాబాద్ యువతకు సువర్ణ అవకాశం
– ప్రత్యక్షంగా 765 మందికి ఉద్యోగాలు-పరోక్షంగా 4 రేట్లు ఎక్కువ మందికి దక్కనున్న ఐటి కొలువులు
– త్వరలో ఐటి హబ్ ని ప్రారంభించనున్న ఐటి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్
– పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటి హబ్ ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని నిజామాబాద్ నగరం లో ఐటి హబ్ ని నిర్మిస్తున్నాము అని తెలియజేశారు.సకల వసతులతో విశాలమైన వాతావరణం లో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరువలో నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభానికి సిద్దమైనది. నిజామాబాద్ ఐటి హబ్ లో 765 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా 4 రేట్లు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ అంటేనే హైదరాబాద్,పూణే,బెంగళూరు నగరాలు గుర్తుకు రాకుండా సకల వసతులతో ఐటీ హబ్ నిర్మించాము. ఐటీ హబ్ నిజామాబాద్ నగరానికి మణి హారంగా మారానుంది. త్వరలోనే ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఐటి హబ్ ని ప్రారంభిస్తారు అని తెలియజేశారు.

Spread the love