– ఏఐకెఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్
నవతెలంగాణ -కంటేశ్వర్
రైతులకు ఎంఎస్పి మద్దతు గ్యారెంటీ చట్టం తీసుకురావాలని మంగళవారం నిజామాబాద్ నాందేవాడ రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ మాట్లాడుతూ.. రైతందానికి కనీసం మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అది రైతులను మోసం చేయడానికి ప్రకటించింది ఎందుకని అంటే రైతులకు మద్దతు ధర కావాలని సంవత్సరానికి పైగా రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహించినప్పటికీ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడం లేదని అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మద్దతు ధర C2+ 50% ప్రకారం వరికి మద్దతు ధర కేంద్రం ప్రకటించింది 2183, క్వింటాల్కు సీటు ప్లస్ 50% 680 రూపాయలు నష్టం ఉంది అని అన్నారు, జొన్నలకు క్వింటాలకు 3168 మద్దతు ధర ప్రకటించగా నష్టం 1114 రూపాయలు నష్టం ఇంతకు జరుగుతోందని అన్నారు సజ్జలకు2500 ప్రకటించగా క్వింటాలకు 650 రూపాయలు నష్టం వాటిల్లుతుందని అన్నారు మొక్కజొన్న 2090 రూపాయలు మద్దతు ధర ప్రకటించగా 606 రూపాయలు నష్టం వస్తుందని అన్నారు వేరుశనగకు మద్దతు ధర 6370 ప్రకటించగా నష్టం 1648, సోయాబీన్ 6600 మద్దతు ధర ప్రకటించగా 1428 నష్టం, పత్తి 7020 రూపాయలు మద్దతుల ప్రకటించగా 2059 నష్టం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర నష్టం వస్తుందని అన్నారు స్వామినాథన్ సిఫారసు కమిటీని అమలు చేసి పంటలకు మద్దతు గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని దానివల్ల రైతాంగానికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు రైతులు అప్పులు కట్టుకోలేక సంవత్సరానికి 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు స్వామినాథన్ కమిటీ సిఫారస్ ప్రకారం పెట్టిన పెట్టుబడికి సగం కలిపి మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశు ఉపాధ్యక్షులు తోగట్టి భూమన్న, దేవేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.