ఫీజులు తగ్గించమనందుకు ఇనుప రాడ్లతో దాడి..

– ఇరు వర్గాలపై కేసు నమోదు.
– చికిత్స పొందుతున్నా బాధితులు.
నవతెలంగాణ – మాక్లూర్
భానుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఓ ప్రయివేట్ స్విమ్మింగ్ పూల్ కు కొందరు వ్యక్తులు వెళ్ళారు. అక్కడ బిల్లులు ఎక్కువగా ఉండటంతో కొంచెం తగ్గించాలని సిబ్బందితో మాట్లాడుతుండగానే అక్కడెబున్న బౌన్సర్లు, యజమాని సైతం వారిపై దాడికి దిగిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని మదన్ పల్లి గ్రామ శివారులో గల ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్  నిజామాబాద్ రూరల్ మండలం తిరుమనపల్లి గ్రామానికి చెందిన రాజేష్, నవీన్, రంజిత్, లింబాద్రి అనే నలుగురు యువకులు మదనపల్లిలోని సుభాష్ గార్డెన్ కు స్విమ్మింగ్ కోసం వెళ్లారు. అక్కడ ధరలను చూసి నివ్వెరపోయారు.  దీంతో యాజమాన్యం దగ్గరికి వెళ్లి గత సంవత్సరం తక్కువ ఉన్న ధరలు ఉండేవని, ఈసారి అమాంతం పెంచేశారని, ధర తగ్గించాలని కోరారు. దాంతో ఆ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం వారి మాటను లెక్క చేయకపోగా ఆ నలుగురు యువకులను క్రూరంగా ఓ గదిలో బంధించి అక్కడే ఉన్న తమ ప్రైవేట్ బౌన్సర్లతో ఇష్టారీతిన దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ యువకులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారి కంటే ముందే సమింగ్ పూల్ యజమాని పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం, పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు.
Spread the love