నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, అసంఘటిత రంగం కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కార్యాలయం వద్ద బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టియు జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, వ్యవసాయ రంగం, గల్ఫ్ కార్మికులు తదితర నాలుగు కోట్ల మంది లో దాదాపు రెండు కోట్ల మంది కార్మిక వర్గం అందులో నూటికి తొంభై శాతం బహుజన జాతులకు చెందిన కార్మికులు కనీస వేతనాలు లేకుండా పని చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో బహుజన శ్రామిక వర్గాన్ని ఐక్య కార్యాచరణ దిశగా కృషి చేయాలని కోరారు.
బిఎల్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగాద సిద్దిరాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం కోసం కృషి చేసే శక్తులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ.. కార్మిక వర్గంలో 50% శ్రామిక మహిళలు శ్రమ దోపిడి తోపాటు పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టియు జిల్లా అద్యక్షులు కె. మధు, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నాయకులు యాదయ్య, గంగా శంకర్, హరీష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గీతాంజలి, నాయకులు కవిత తదితరులు పాల్గొన్నారు.