మంథని రాజేందర్ రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం

నవతెలంగాణ -కంటేశ్వర్
న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వందకోట్ల నిధిని కేటాయించిన మూలంగా ఆదివారం వేలాదిమంది న్యాయవాదులకు ఆరోగ్యభీమా పథకం అమలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సమర్పించిన వినతిపత్రం తెలియజేశారు. హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో ఆయనను కలిసి న్యాయవాదులకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుగా కొన్ని విలువైన ప్రగతికాముక సూచనలు వివరించారు.చాలామంది న్యాయవాదులు చాలా రకాల ఆర్ధిక, సామాజిక, వృత్తి పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుపుతు వాటిని రూపుమాపడానికి ప్రభుత్వ పరిధిలో కొన్ని విధానపరమైన నిర్ణయాల అవసరాన్ని తెలిపారు.అమ్మ అయినా అడగందే పెట్టదనే నానుడినిలో అమ్మలాంటి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ నిధి నుండి న్యాయవాదులకు మరణాంతర పరిహారం నాలుగు లక్షలు అందిస్తున్నారని,అనారోగ్యంతో బాధపడుతున్న వారికి,ఇతరత్రా గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మరణాంతర పరిహారం 8 లక్షలు,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 10 లక్షలు ఉన్నదని,కేరళ రాష్ట్రం 20 లక్షలకు పెంచబోతున్నదని తెలియజేస్తు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయం తీసుకునేటట్లు చొరవ చూపాలని మంత్రిని కోరారు.న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్వతహాగా న్యాయవాది అయిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ దృష్టికోణం కు తద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయవాద సమాజానికి మేలు కలిగే విధానంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళతానని అన్నారు.

Spread the love