మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో జల కళ

– కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు,కుంటల్లో గణనీయంగా పెరిగిన నీటి సామర్థ్యం
– 100 % శాతం సబ్బిడీ తో చేప మరియు రొయ్య పిల్లల పంపిణీ
– 4 లక్షల మంది మత్స్యకారులకి లభిస్తున్న ఉపాధి
– ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మృగశిర కార్తె ని పురస్కరించుకొని పాత కలెక్టర్ గ్రౌండ్ లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. చేప పిల్లల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.100 % శాతం సబ్బిడి తో ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను అందిస్తుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స సంపద గణనీయంగా పెరిగింది.4 లక్షల మంది మత్స్యకారులు ఉపాధి పొందున్నారు.చేప ఉత్పత్తులను పెంపొందించుటకు,వాడుటకు ఫుడ్ ఫెస్టివల్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్ లు, నాయకులు మత్స శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love