– మౌళిక సదుపాయలకు పెద్ద పీట
– అభివృద్ధి,సంక్షేమం రెండు కండ్లు
– హరిత ప్రగతికి నిజామాబాద్ నగరానికి అవార్డులు
– నేటి నుండి ప్రతి డివిజన్ లో పర్యటించి సమస్యలు పరిష్కారం
– 39వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ నగర సుందరీకరణనే నా లక్ష్యం అని మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరిగిందని అభివృద్ధి సంక్షేమం తనకు రెండు కన్నులని హరిత ప్రగతికి నిజాంబాద్ నగరానికి అవార్డులు వచ్చాయని నేటి నుండి ప్రతి డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామని 39 వ డివిజన్ పర్యాటనలో అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తెలియజేశారు. అందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు 39వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ లత కృష్ణ అధికారులతో కలిసి గురువారం పర్యటించారు.39వ డివిజన్ లో 1 కోటి రూ.లతో నిర్మిస్తున్న డ్రైనేజి, బిటి రోడ్డు,సీసీ రోడ్డు పనులని భూమి పూజ చేసి ప్రారంభించారు.
39వ డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కాలనీ, న్యూ ఎన్జీవోఎస్ కాలనీ, ఓల్డ్ ఎన్జీవోఎస్ కాలనీ, అంబేద్కర్ కాలనీలో కాలి నడకన ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ… నిజామాబాద్ నగరం సుందరికరణే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తున్నాము అని తెలిపారు. 9 ఏండ్ల కాలంలో ఊహించని విధంగా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసామన్నారు.
ఎక్కడ చూసినా పచ్చని పందిరి ల చెట్లు,విశాలమైన రోడ్లు, ఇంద్రధనస్సు తలపించే లైట్లతో నిజామాబాద్ నగరం ముస్తాబయింది. పట్టనికరణ కు అనుగుణంగా నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాము. నిజామాబాద్ నగరం లోని ప్రతి డివిజన్ లో రూ. కోటితో అభివృద్ధి పనులు చేస్తున్నాము. 39వ డివిజన్ లో రూ. కోటిలతో డ్రైనేజీలు, బిటి రోడ్లు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నాము. నేటి నుండి ప్రతి డివిజన్ లో పర్యటించి ప్రజాల నుండి నేరుగా సమస్యలు తెలుసుకుంటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అని తెలియజేశారు. 39వ డివిజన్ లో ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాశ్, పూజిత ప్రవీణ్ గౌడ్, మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఎలాక్ట్రిసిటీ అధికారులు పాల్గొన్నారు.