పరుగులు పెడుతున్న పట్టణ ప్రగతి..

– ముఖ్యమంత్రి కేసీఆర్ l ఆలోచనలకు అనుగుణంగా కేటీఆర్ మార్గ నిర్ధేశ్యం లో దేశానికి ఆదర్శంగా పుర పాలక పట్టణాభివృద్ధి శాఖ
– పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి
– నిజామాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి
– 1000 కోట్ల రూ.లతో నిజామాబాద్ పట్టణం లో అభివృద్ధి పనులు
– పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా భూమా రెడ్డి కన్వెన్షన్ హల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో మంత్రి వర్యులు కేటీఆర్ నిర్ధేశ్యం లో తెలంగాణ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ నగరానికి 1000 కోట్ల రూ.ల నిధులు మంజూరు చేశారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని 9 సంవత్సరాల లో నిజామాబాద్ నగరాన్ని సుందరంగా మార్చము.20 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియాన్ లు ఏర్పాటు చేసి మొక్కలని పెట్టడం జరిగింది. గతంలో స్మశాన వాటికల్లో అరకొర వసతులు ఉండేవి. మనిషి చనిపోయిన తరువాత గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు నిర్మిస్తున్నాము. నిజామాబాద్ ప్రజలకు కూరగాయలు మరియు మాంసం ఒకే చోట దొరికేల సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా నిజామాబాద్ నగరం లో ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నాము. ప్రజల సహకారం తో యుద్ధ ప్రాతికన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను పూర్తి చేసాము. యువకులకు మానసిక ఉల్లాసం కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసాము. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ని నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ వేతల నుండి విముక్తి కల్పించాము. నిజామాబాద్ ప్రజలు శారీరకంగా దృఢత్వంగా ఉండటానికి 35 ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసాము. బస్తీల సుస్థి ని నయం చేయడానికి 3 బస్తీ ధవాఖానాలు ఏర్పాటు చేసాము.బస్తీ దవాఖానలో ఉచితంగా రోగ నిర్ధారణ చేసి మందులు పంపిణీ చేస్తున్నాము.ఖాళీ స్థలాలలో పార్కులు నిర్మించి నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి సదుపాయాలు ఏర్పాటు చేసాము. పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపదాచడానికి అవసరమైన వాహనాలు కొనుగోలు చేసాము. నగరంలో ఎక్కడ చూసినా పచ్చదనం విరజిల్లెల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాము.రాబోయే రోజుల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణీకరణకు అనుగుణంగా మరింత అభివృద్ధి చేస్తానని తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ , జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ,కమిషనర్ కు.చిత్ర మిశ్రా కార్పొరేటర్ లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Spread the love