నగరంలోని వెజిటేబుల్ మార్కెట్ ను సందర్శించిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని వెజిటేబుల్ మార్కెట్ ను గురువారం ఉదయం 4 గంటలకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సందర్శించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కూరగాయలు పండించిన రైతులను కలిసి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు…ఈ సందర్భంగా అక్కడున్న కూరగాయ వ్యాపారులు, మార్కెట్లో ఉన్న రైతులు భారీ వర్షాల వల్ల పండించిన కూరగాయలు నీళ్లలో కొట్టుకుపోయాయని వాపోయారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ.. వర్షా కాలంలో రైతులకు అండగా నిలువలేని ప్రభుత్వాలను వారి మాయ మాటలను మీరు నమ్మకండి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే మీ అందరికి వర్షాకాలంలో వ్యాపారాలకు వెసులుబాటుగా ఉండేలా ఇక్కడే షెల్టర్ ని ఏర్పాటు చేసేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ప్రత్యేకంగా నేను మీకోసం పోరాడి తప్పక మీరు చెప్పిన సమస్యలకు పరిష్కరిస్తామని హామీ  కాంగ్రెస్ నాయకులు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇచ్చారు.
Spread the love