పోలీసు అధికారులకు ఎక్సైజ్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు

నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మి నర్సయ్య ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులకు, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ లకు శిక్షణ తరగతి నిర్వహించి కేసుల పంచనామా, చార్జిషీట్, రిమాండ్ రిపోర్టులు తయారు చేసే విదానము గురించి నిజామాబాద్ ప్రాఫిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్, ఎం. డి.రహీం మొద్ధిన్ లు శనివారం వివరంగా వివరించారు. నేరస్తులకు శిక్షణ పడేట్లు విచారణ సేకరించి కోర్టులో సరియైన విధంగా దాఖలు చేయాలని తెలిపారు.ఈ సమావేషములో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రవిరాజ్,కవిత రెడ్డి, కోర్ట్ లైజన్ ఆపీసర్ శ్యాం సుందర్, ఎక్సైజ్ ఆపీసర్ సింధు, టాస్క్ ఫోర్స్ ఆపీసర్ గంగాధర్, కోర్టు ఆపీసర్లు సాయిశ్యాం, సందీప్ లు పాల్గొన్నారు.
Spread the love