నిజాంబాద్ జిల్లా కేంద్రంలో 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

– వాతావరణ శాఖ అధికారి ఆశిష్
నవతెలంగాణ – కంటేశ్వర్
గత వారం రోజులుగా ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో భూమి చాలా వేడెక్కి నైరుతి రుతుపవనాల వైపు మళ్లడంతో భూమి కింది భాగంలో వేడెక్కడం ద్వారా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసిందని 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఆదివారం నమోదయిందని నిజామాబాద్ వాతావరణ శాఖ అధికారి ఆశిష్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడిందని వాతావరణం ఇదేవిధంగా గత మూడు నాలుగు రోజులపాటు ఉంటుందని ఎండ నుండి ప్రస్తుతం ప్రజలు ఉపశమనం పొందవచ్చని తెలిపారు. ఇక ఉష్ణోగ్రతలు పెరగవాని తగ్గుతూనే ఉంటాయని వారం రోజుల్లో కూడా 35 డిగ్రీల క్రిందికి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అలాగే ఒకవేళ ఈ వారంలోపు నైరుతి రుతుపవనాలు ఉత్తర దిశగా టచ్ అయితే వర్షాకాలం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Spread the love