నవతెలంగాణ- కంటేశ్వర్
మాజీ మంత్రివర్యులు పి సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కంటేశ్వర్ లోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ భవన్ నందు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బీన్ హందన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాకు ఎనలేని సేవలు చేశారని, జిల్లాలోని యువత చదువు కోసం మెడికల్ కాలేజీను నిర్మించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని, సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో రైతాంగానికి ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ 20 ,21 ద్వారా మంచిర్యాల రిజర్వాయర్ కు 800 కోట్లు కేటాయించిన వ్యక్తి అని, అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం గాని, నిజం సాగర్ ఆధునీకరణ గాని చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డిని, ఏ పదవిలో ఉన్న ఆ పదవికి తన వంతు కృషిని చేసే వ్యక్తి అని, సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని మానాల మోహన్ రెడ్డి ఆ దేవుని ప్రార్థించారు.
ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. సుదర్శన్ రెడ్డి జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అని ,సాగునీటి, విద్య వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఎనలేని సేవలు చేశారని, అలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సుదర్శన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అని యువకులు, రైతులకు మేలు కలిగే విధంగా వైద్య కళాశాల గాని, నిజం సాగర్, అల్లి సాగర్ ఎత్తిపోతల పథకాలు గాని నిర్మించిన వ్యక్తి అని, ఈరోజు సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని, వారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి, మరొకసారి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రమార్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ ఎస్ యు అద్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డీ రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు చంద్రకళ, ఉష, కార్యదర్శి విజయలక్ష్మి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మలైకా బేగం, ఆశాబి, సుభాష్ జాదవ్, సాయిలు, అష్రఫ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.