కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దాహనం

నవతెలంగాణ- కంటేశ్వర్
ఇటీవల సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భంగా రాహుల్ గాంధీ  గుజరాత్ హైకోర్టులో స్టే కోరుతూ పిటిషన్ పెట్టుకుంటే దానిని గుజరాత్ హైకోర్టు విచారణ జరపకుండానే పిటిషన్ను కొట్టివేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెబ్బిన్ హందాన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ రాహుల్ గాంధీ  స్టే కోరుతూ గుజరాత్ హైకోర్టులో వేసిన పిటిషన్ను విచారణ జరపకుండానే కొట్టివేయడం అనేది రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేయడమే అవుతుందని, రాజ్యాంగ వ్యవస్థకు చట్టపరమైన నిబంధనలకు లోబడి హైకోర్టు విచారణ జరపాలని కానీ ప్రస్తుతం బిజెపి ప్రభుత్వ హయాంలో హైకోర్టు మోడీ అడుగులలో మడుగులు వేస్తూ ఆయన చెప్పిందే చేస్తున్నాయని ,ఏదైతే విచారణ జరపకుండా రాహుల్ గాంధీ గారి పిటిషన్ కొట్టివేయడం ఏదైతే ఉందో చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బీన్ హమ్దాన్ మామాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి విశ్వాసం ఉందని కానీ ప్రస్తుతం దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ఒక నియంత పాలన కొనసాగుతుందని అందులో భాగంగానే సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షకు ష్టే కోరుతూ రాహుల్ గాంధీ  గుజరాత్ హైకోర్టులో వేసిన పిటిషన్ అక్కడి ధర్మాసనం మోడీ మాయలో పడి విచారణ జరుపకుండానే కొట్టి వేయడం అనేది చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబూద్ బిన్ హమ్దన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, నగర మైనారిటీ అధ్యక్షులు ఏజాజ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, గంగారెడ్డి, అజీజ్ అన్సారి, వాహీద్, శోభన్, కరీముద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love