29వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ

నవతెలంగాణ- కంటేశ్వర్
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో గల ఎమ్మార్పీఎస్ టీఎస్ కోరు కమిటీ సభ్యులు రెనుకుంట నాంపల్లి స్థానిక ఎల్లమ్మ గుట్టలో 29వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెండా ఆవిష్కరించారు. అనంతరం నాంపల్లి మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాలు ఐక్యంగా ఉండి వర్గీకరణ జరిగే వరకు పోరాటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. మాదిగలకు ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి హక్కులు సాధించుకోవాలని కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్, జిల్లా అధ్యక్షురాలు లతా సీనియర్, నాయకులు గాజుల రామచంద్ర, సాయిబాబా, పద్మ, లక్ష్మిసంపత్, శివ శంకర్, ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love