నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను శుక్రవారం డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరికి దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.ప్రతిమ రాజ్ మాట్లాడుతూ..ముందుగా తెలంగాణా రాష్ట్ర సాధకులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర రావు కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అసుపత్రి అభివృద్ధి కి అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావుకి, మరియు గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి, నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లులందరికి, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ మేయర్ కు ప్రతి ఒక్కరికి ఇతర ప్రజా ప్రతినిదులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించి పది సంవత్సరాలు గడిచిన ఈ కాలంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ రైతుబంధు పథకం, రైతు భీమ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే రాష్ట్రంలో జల వనరులను సమృద్ధి పరిచారని తెలిపారు. అలాగే ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలియజేశారు.
ఆస్పత్రిలో సిటీ స్కాన్ టిఫ స్కాన్ మరియు ఇతర అనేక అధునాతనమైన పరికరాలను అందుబాటులో ఉంచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నామని తెలియజేశారు. కెసిఆర్ కిట్టు ద్వారా ఇప్పటివరకు 33 వేల కిట్లు అందించామని, ఎన్నో ప్రత్యెక శస్త్ర చికిత్స లు నిర్వహించామని, అన్ని రకాల సౌకర్యాల ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే ఆసుపత్రిలోని ప్రతి విభాగానికి సంబంధించిన సిబ్బందిని నర్సింగ్ సిబ్బందిని పరిపాలన సిబ్బందిని సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఆసుపత్రిలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కె స్వామి సీనియర్ గైనకాలజిస్ట్ నిజామాబాద్ మాట్లాడుతూ గతం లో కంటే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు మెరుగుపడ్డాయని ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమైందని, తెలంగాణ సాధన కోసం అమరులైన త్యాగమూర్తులను సంస్కరించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల విభాగాధిపతులు నర్సింగ్ సిబ్బంది ఇతర సిబ్బంది పాల్గొన్నారు.