బిజెపి నేత ధన్ పాల్ నీ పరామర్శించిన ఆలయ ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలోని మార్వాడి గల్లీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ని వారి నివాసంలో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి నరహరి పరామర్శించడం జరిగింది. ఇటీవలి కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న ధన్పాల్ ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కొంతసేపు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది నరహరి మాట్లాడుతూ.. ధన్పాల్ వ్యక్తిగతంగా మంచి మిత్రుడు అన్నారు. వారి సామాజిక సేవ పేద ప్రజలకు అవసరమని కొనియాడారు ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల పైన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ధనపాల్ వినయ్ కుమార్ దన్ పాల్ మణిమాల వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love