అనాధలకు సేవా ఇందూరు యువత సాయిబాబు


– తన జీవితమే సేవకు పూర్తిగా అంకితం

నవతెలంగాణ – కంటేశ్వర్
కుళ్ళు పట్టిన శరీరాలకు ఆయన ఓ సంజీవని రోడ్లు,కుడళ్ళ చుట్టే ఆయన ప్రయాణం చీము పట్టినా కాళ్ళకు పుండ్లునుండి రక్తం కారే అభాగ్యుల కోసమే ఆయన అన్వేషణ తల్లి బిడ్డకు సేవా చేసినట్టే ఆయన ఆనాధలకు విదివంచితులకు నిరాశ్రయులకు ఆప్తుడై ఆత్మీయ సేవా సాయిబాబు గా పిలువబడుతున్నాడు.మానవ సేవే మాధవ సేవ అనే నానుడి ఇలాంటి వారి సేవలు చూసినప్పుడే నిజమనిపిస్తుంది.
పూర్తి వివారాలోకేళ్తే..
జిల్లా ప్రాంతానికి చెందిన డాక్టర్ మద్దుకూరి సాయిబాబు 2011 లో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ని స్థాపించి అనాధలకు అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు  అలాంటి వారిని చూస్తేనే అసహ్యం వేస్తుంది వాళ్ళు ఎదురైతేనే ఓళ్ళు జలతరిస్తుంది పెరిగిన గడ్డం అట్టలుకట్టిన జుట్టు అందవికారంగా నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్లపై నిస్సహాయ స్థితిలో తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు  సాయిబాబుకి కనపడితే చాలు తన వేకిల్ డిక్కీ ఓపెన్ అవుతుంది అందులో అన్ని దూది ఉండలు, పుండ్లమందులు, పట్టిలే కనపడుతు ఉంటాయి వాటిని తీసి ఫుట్ పాత్ లప్ రోగ గ్రస్తంగా ఉన్న వారి పక్కన కుర్చుని ఆ పుండ్లని క్లీన్ చేసి పట్టి కడుతుంటాడు వారి ఆకలి తీరుస్తుంటాడు మానవత్వమే నిజమైన దైవత్వం అని తను నమ్మే మెదటి సిద్ధాంతమని సాయిబాబు మాటలు.. రోడ్లపై ఆనాధలు విదివంచితులు చనిపోతే ఆ అనాధ మృతదేహాలకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు పోలీసుల అనుమతితో.. ఇప్పటి వరకు 75 అనాధ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగిదని ఆయన తెలిపారు. ప్రతిరోజు 200 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రికి వివిధ ప్రాంతాల్లనుంచి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు అనంతరం రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్దులకి అనాధలకి నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తు యువతలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వేలికి తీస్తూ యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.ఈ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ లో 180 మంది సభ్యులు ఉన్నారు ప్రతి నెల మెంబర్ షిప్ ఏమెంట్ వేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో రిటైర్డ్ ఎంప్లాయిస్ , ప్రభుత్వ ఉద్యోగులు యువకులు ఉన్నారు.  వివిధ మండలాల్లో కమిటిలను ఏర్పాటు చేసి యువతను సేవా కార్యక్రమాల్లో రాణింపచేస్తున్నారు
సహకారం
జిల్లా అధికారులు,  పోలిస్ యంత్రాంగం, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వివిధ హాస్పిటల్స్ డాక్టర్స్  సహకారం ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. మా ముందున్న లక్ష్యం జిల్లాలో మనశ్శాంతి కోవెల ఆశ్రమం ఏర్పాటు కి సంబంధించి జిల్లా రాజకీయ నాయకులు జిల్లా గౌరవ అధికారులు & అనధికారుల అందరి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం.

Spread the love