రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి ఐ.ఎస్.ఓ గుర్తింపు..

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ రక్త కేంద్రం గత శనివారం ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైసెషన్ వారు వచ్చి తనిఖీ చేసి రెడ్ క్రాస్ సంస్థ వివరాలు, చేపడుతున్న కార్యక్రమాలు అలాగే రెడ్ క్రాస్ రక్త కేంద్రం పరిశుభ్రత , రక్త సేకరణ నాణ్యత మరియు పరిమాణాలు తనిఖీ చేసి ఐ.ఎస్.ఓ సరిఫికేట్ జారీ చెయ్యడం జరిగింది.ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీమతి తమిళసాయి సౌందరాజన్ నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ వారి చేతులమీదుగా నిజామాబాదు జిల్ శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు ఐ.ఎస్.ఓ పత్రం బుధవారం అందచేయటం జరిగింది. అలాగే రెడ్ క్రాస్ లో ఎక్కువ సార్లు రక్త దానం చేసిన నిజామాబాదు జిల్లా కోర్టు ఉద్యోగి కే.నాగేందర్ ని జ్ఞాపికతో ప్రశంసిస్తూ మున్ముందు కూడా ఇలానే రక్త దానం చేస్తూ యువతకి స్ఫూర్తి నివ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మరియు కోశాధికారి కరిపే రవీందర్ పాల్గొన్నారు.

Spread the love