దుర్కిలో ఘనంగా బోనాల పండుగ

నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. సాయంత్రం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. సొసైటీ చైర్మన్ డివిటీ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ శ్యామల శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యుడు డాక్టర్ నారాయణ లు బోనాలను ప్రారంభించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.  ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్ ఖదీర్, రాకేష్, మహేష్ , గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love