జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

నవతెలంగాణ –  కంటేశ్వర్
వనపర్తి లో డిసెంబర్ 2022 2,3,4తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడా కారులు ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయస్థాయి జూనియర్ పురుషుల హాకీ జట్టుకు ఎంపికైనట్లు నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ సోమవారం తెలియజేశారు. వీరు జూన్ 12 నుండి 22వ 2023, రావుర్కెల ఒరిస్సా రాష్ట్రం లో జరిగే జాతీయస్థాయి జూనియర్ పురుషుల పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా నుండి ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు జాతీయస్థాయిని కాకుండా అంతర్జాతీయ స్థాయి వరకు చేరుకోవాలని వారిని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగరెడ్డి , జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ , కోశాధికారి పింజ సురేందర్, ఉపాధ్యక్షులు విద్య సాగర్ రెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతు, రిటైర్డ్ హాకీ కోచ్ హర్షవర్ధన్ రెడ్డి , మక్బూల్( హాకీ కోచ్) ,సంయుక్త కార్యదర్శులు ఎండి జావిద్ (హాకీ కోచ్), యండి ఆరిఫ్ ,చిన్నయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి అంజు, ఈసీ మెంబర్ సంతోష్, నాగేష్ ,సుధీర్ ,కత్తి శ్రీనివాస్ , రాహుల్, నవనీత్ లు మరియు సీనియర్ క్రీడాకారులు జిమ్మీ రవి ,వీరిని అభినందించారు.

Spread the love