పొద్దుటూరి రవీందర్ రెడ్డి మరణం పట్ల మంత్రి దిగ్భ్రాంతి

– రవీందర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రముఖ న్యాయవాది పొద్దుటూరి రవీందర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంపల్లిలో ఆయన పార్థివదేహానికి మంత్రి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన కుటుంబ దగ్గరి అత్మీయులు అడ్వొకేట్ పొద్దుటూరి రవీందర్ రెడ్డి (పి పి) మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ఓదార్చారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Spread the love