ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చెయ్యడం సిగ్గు చేటు

నవతెలంగాణ- కంటేశ్వర్
భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో , నిన్న విద్యారంగ సమస్యలు పరిష్కారానికి ఎన్ ఈ పి -2020 రద్దు చేయాలని చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసినదానికి నిరసనగా గిరిరాజ్ కళాశాల గేట్ వద్ద బుధవారం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం (ఎన్ ఈ పి-2020) నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి పేద విద్యార్థులను చదువుకు దూరం చెయ్యడం ఏ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ ( SABKA SAATH SABKA VIKAS ) అవుతుందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసి ,కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని రాష్ట్రాలపై చలయించటం ఎంత వరకు సబబు అని అన్నారు.ఈ ఎన్ ఈ పి-2020 లో 4 సంత్సరముల డిగ్రీ విద్య వలన డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది అని అలాగే పీహెచ్డీ స్కాలర్స్ ఇచ్చే ఫెలోషిప్ గురించి గానీ, రిజ్వేషన్లపై గానీ ఎన్ ఈ పి స్పష్టత లేకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్విర్యం చేసే నూతన విద్యావిధానాన్ని రద్దు చేసే వరకు ఎస్ ఎఫ్ ఐ దేశవ్యాప్త కార్యక్రమాలు చేస్తామని , భవిష్యత్తులో పార్లమెంట్ భవాన్నని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కారించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు విద్యారంగంలో ఉన్న డొల్లతనం బయటపడుతుందని భయంతో విద్యార్థి, మీడియా, రాజకీయ నాయకులను విద్యాసంస్థల్లో రానివ్వకూడదని ఆదేశాలు ఇవ్వడం ఆప్రజాస్వామికమైన చర్య అని అన్నారు ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా వెళ్లాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పోషమైన మహేష్ నగర అధ్యక్షులు విశాల్,నగర ఉపాధ్యక్షులు దీపిక ,గణేష్ ,సందీప్  నాయకులు గణేష్ ,సంతోష్ , లక్ష్మణ్,మణికంఠ ,రాజన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love