GT vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 45వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ 3: 30 pm కి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఆడిన 9 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన 9 మ్యాచ్లలో రెండు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్ లో ఉంది.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాహా (WK), గిల్ (C), సుదర్శన్, మిల్లర్, ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : కోహ్లి, డుప్లెసిస్ (C), విల్ జాక్స్, పాటిదార్, గ్రీన్, మ్యాకె వెల్, దినేష్ కార్తీక్ (WK), కర్ల్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్.

Spread the love