నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని సెకండ్ ఎంపీటీసీ సభ్యురాలు అనూష బాయి, శివాజీ కుమారుడి వివాహనికి మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం నాడు మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో జరిగింది. వివాహనికి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ యువ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వివాహనికి విచ్చేసి వధువరులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులకు ఎంపీటీసీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.