ముదిరాజ్ అధ్యక్షునిగా మెతుకు శివకుమార్ నియామకం

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రి.నెం. 443/14 నిజామబాద్ జిల్లా అధ్యక్షునిగా మెతుకు శివకుమార్ ముదిరాజ్ నిజామబాద్ అర్బన్ ని నియమించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అని తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలిపారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ నియమించిన జిల్లా అధ్యక్షునిగా జాతిని ఐక్యం చేస్తూ జిల్లాల కమిటీలను, జిల్లా అనుబంధ విభాగాలను నిర్మాణం చేయడం ద్వారా ముదిరాజుల అభ్యున్నతికి, పురోగతికి, సంక్షేమానికి, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో పురోగాభివృద్ధికి కృషిచేస్తారని విశ్వశిస్తున్నాము. తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్దేశించుకున్న లక్ష్యాలను నేరవేర్చుటలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకత్వంలో తగిన రీతిలో మీ బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు. నిజాంబాద్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడిగా అయినందుకు ప్రతి ఒక్కరూ ఘనంగా సన్మానించారు.

Spread the love