అకాల వర్షం..అపార నష్టం..

– కల్లాల్లో తడిసి ముద్దాయిన ధాన్యం కుప్పలు
– విద్యుత్ సరఫరాకు అంతరాయం
– ఆదుకోవాలని రైతులు వేడుకోలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో మంగళవారం సాయంత్రం అకాలంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయు,.కోతకు వచ్చిన పొలాలు గాలి బీభత్సంతో నెలపాలై తీరని నష్టం వాటిల్లిందని బాధిత రైతులు కన్నీరుమున్నీరైయ్యారు. మండలంలో కొయ్యుర్, కొండంపేట,రుద్రారం, ఎడ్లపల్లి,వళ్లెంకుంట,మల్లారం,తాడిచెర్ల,పెద్దతూoడ్ల గ్రామాల్లో వర్షం కురిసింది. రైతులు విక్రయించడానికి కల్లాల్లో అరబోసిన ధాన్యం కుప్పలు తడవుగా,గాలి బీభత్సంతో  మామిడి తోటల్లో  కాయలు నెలారాలాయి.ప్రధాన రహదారులకు ఇరువైపులా  చెట్లు విరిగి కరెంట్ తిగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిపిపోయింది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంగళవారం కురిసిన వర్షంతో వాతావరణం ఒకేసారి చల్లబడింది.అకాల వర్షం,ఈదురు గాలులతో నష్టపోయిన వరి, మామిడి రైతులను ప్రభుత్వం అదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.
Spread the love