భానుడి భగభగ..

– మండుతున్న ఎండలు
– మల్హర్ @41.9
– నిర్ముషణంగా మారుతున్న రహదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో సూర్య ప్రతాపం మొదలైంది.ఎండల తీవ్రత రోజురోజుకు అధికామవుతోంది.పది రోజుల్లో పది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తల్లడిల్లుతున్నారు. బుధవారం 41.9 డిగ్రిల సెల్పీఎస్ గా నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 41.9 డిగ్రీలు నమోదు కావడం విశేషం.ఉదయం 9 గంటలకే భానుడు భగభగలు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. పనులమీద బయటకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో గ్రామాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలు లేక రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఎండల తీవ్రతకు జనం అనారోగ్యానికి గురవుతున్నారు.సీజనల్ వ్యాధుల కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.వడదెబ్బ లక్షణాలతో జ్వరం,తలనొప్పి,వాoతులు,విరిచనాలు తదితర సమస్యలతో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న పరిస్థితి.
Spread the love