బడుగు,బలహీన వర్గాలు ఆశయ జ్యోతి శ్రీపాదరావు

– స్వర్గీయ, ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్  దుద్దిళ్ల శ్రీపాదరావు: ప్రజాప్రతినిధులు, అధికారులు,నాయకులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
బడుగు,బలహీన వర్గాల ఆశయజ్యోతి స్వర్గీయ,ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభాధిపతి దుద్దిళ్ల శ్రీపాదరావుని మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలనే ఆదేశాలతో శనివారం మండలంలోని కొయ్యుర్ లో ఉన్న శ్రీపాదరావు విగ్రహం వద్ద శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి,ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.అనంతరం పలువురు మాట్లాడారు శ్రీపాదరావు బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఆయన బాటలో తెలంగాణ ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు నడుస్తూ పెదప్రజల కోసం పరితపిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు.ఎంపిడిఓ శ్యాం సుందర్,తహశీల్దార్ రవి కుమార్,జెడ్పిటిసి కోమల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దండు రమేష్,ఎంపిటిసి ఏనుగు నాగరాని,విద్యుత్ ఏఈ సంపత్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గడ్డం క్రాoతి, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు,బొమ్మ రమేష్ రెడ్డి,సంగ్గెం రమేష్,మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,మమత, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,రాహుల్,సవేందర్, మల్లారెడ్డి, నాయకులు,యూత్ నాయకులు,మహిళ నాయకురాళ్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love