డి83 కెనాల్ నుండి సాగునీరు అందించాలి: దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 

– సీఈ సుధాకర్ రెడ్డిని ఆదేశించిన మంత్రి
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని ప్రాంత రైతులకు డి83 కెనాల్ గుండారం నుండి కమాన్ పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల గ్రామాల రైతుల పొలాలకు వెంటనే మంగళవారం నుంచి సాగు నీరు అందించాలని చీఫ్ ఇంజనీర్ (సిఈ)సుధాకర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డి83 పైనుండి వదిలే వాటర్ ను అక్కడక్కడ మోటర్లు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మోటర్లు పెడుతున్నట్లు తెలిసినందున ఎలాంటి పర్మిషన్ లేని మోటర్లకు కరెంట్ కట్ చేసి  రైతులకు నీళ్లు అందించాలని సిఈని ఆదేశించారు. గుండారం రిజర్వాయర్ నుండి వెంటనే నీటి విడుదల చేసి  రైతుల  పొలాలకు ఎలాంటి నష్టం జరుగకుండా రేపటి ఉదయం రైతులందరి పొలాలకు సాగు నీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
Spread the love