పైళ్ల మల్లారెడ్డి సేవలు మరువలేనివి: సీపీఐ(ఎం)

– సుంకిశాలలో 18వ వర్ధంతి సభ 
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని సుంకి శాల గ్రామంలో మాజీ సర్పంచ్ అమరజీవి పైళ్ల మల్లారెడ్డి 18 వర్ధంతి కార్యక్రమం సీపీఐ(ఎం) గ్రామ శాఖ, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. పైళ్ల మల్లారెడ్డి సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చిన్నతనం నుండే సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాల్లో పాల్గొని నిరంతరం ప్రజల కోసం అనేక  ఉద్యమాలు నిర్వహించారన్నారు. గ్రామానికి సర్పంచ్ గా పని చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతుల కోసం సాగునీటి కాలువలను సాధించేందుకు,ప్రజలకు తాగునీరు అందించేందుకు మౌళిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉపయోగపడే  శ్రీవెంకటేశ్వర పాఠశాల, కళాశాల భవనాలను వలిగొండ మండల కేంద్రంలో ఎన్నారై మల్లారెడ్డి సహకారంతో నిర్మించేందుకు ప్రత్యేక కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో వారి కుమారుడు కోడలు గ్రామ సర్పంచ్ గా ఆయన అడుగుజాడల్లో గ్రామ అభివృద్ధి కోసం కృషి జరిపారని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) కార్యకర్తలు,గ్రామ ప్రజలు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య,కవిడే సురేష్, శాఖ కార్యదర్శి గూడూరు వెంకట నరసింహారెడ్డి, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు, పిఎన్ఎం మండల నాయకులు కొమ్ము స్వామి, రాదారపు మల్లేశం, శాఖ సహాయ కార్యదర్శి మంగ బాలయ్య, నాయకులు పోలపల్లి పెద్ద స్వామి, జెట్ట యాదగిరి, మంగ పాండు,గోపగాని కుమార్, పోలేపల్లి రాములు, కాటేపల్లి పాండు,మొగిలిపాక బొందయ్య,యాదయ్య, కాటపల్లి వెంకటేశం, ఈర్లపల్లి నరసింహ, బోదాసు సోములు, వేముల రాములు,చింతల నర్సింహ,వేముల జ్యోతి బస్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love