బీడీ కార్మికులకు షరతులు లేకుండా జీవన భృతి ఇవ్వాలి

విలేకరుల సమావేశంలో  మాట్లాడుతున్న దండి వెంకట్
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దండి వెంకట్
– ఆగస్టు 7న ఛలో నిజామాబాద్ కలెక్టరేట్ 
– బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ 
నవతెలంగాణ కంటేశ్వర్
బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్(బీఎల్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కోరారు. 2019 లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్  ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ గెలిస్తే బీడీ కార్మికులకు షరతులు లేకుండా 2016జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ వరకు ప్రకటించలేదన్నారు‌. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బిఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు సరైన ఉపాధి అవకాశాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న బీడీ కార్మికులకు షరతులు లేకుండా 216 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న ఛలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కోరారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి  గృహం నుండి ఉదయం 11 గుంటలకు ప్రదర్శన ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆగస్టు 7న బీఎల్టీయూ అనుబంధ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బీఎల్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, అధ్యక్షులు కాంబ్లే మధు, జిల్లా నగర నాయకులు ప్రవీణ్ సింగ్ పాల్గొన్నారు.
Spread the love