నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని గుండూర్ రోడుకు వెళ్లే దారీ గ్రామీణ బ్యాంకు సమీపాన చుట్టు పక్కల ఉన్న మటన్ మాంసం మరియు చికేన్ విక్రయించే దుకాణాదారులు, కూరగాయలు విక్రయించేవారు. చాట్ బండిల నడిపేవారు వారు, కాలని వాసులు, హోటళ్లు నడిపేవారు, టీస్టాల్స్ నడిపేవారు, వ్యాపారస్తులు, చెత్త చేదారం వెస్టేజ్ ను దగ్గర్లోని మజీదు మేారి వద్గ వేయడంతో దానికి నిత్యం వర్షాలు పడి మురికి కాలువలో కొట్టుకొచ్చి నీరువెళ్లకుండా అడ్డం వస్తుండటంతో సమస్య తీవ్రంగా అయింది. జీపీ కార్మీకుల సమ్మే తోడవడంతో వచ్చే పోయే వాహనదారులకు, పాదచారులకు కంపు, దుర్గందం పట్టలేక ముక్కు మూసుకొని పోయే దుస్థితి నెలకొంది. ముఖ్యమైన నాయకులు ప్రజాప్రతి నిధులు జీపీ అధికారులు నిత్యం వెళ్లే దారీ అయినప్పడి కిమ్మనడం లేదు. చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు దుర్గందం భరించలేక ఇళ్లు ఖాలీచేసి పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పడికైన మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్, అధికారులు సమస్యను పట్టించుకుని వెంటనే దుర్గందం రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.