ఇసుక అక్రమ మాఫియాను అడ్డుకోండి…

– ప్రజలారా ప్రతిపక్ష నాయకులారా మేలుకోండి ఇసుక అక్రమ మాఫియాను అడ్డుకోండి ప్రజల శ్రేయస్సు కోసం తాను దేనికైనా సిద్ధమే అది నా సామాజిక బాధ్యత ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు బాలు యాదవ్
నవతెలంగాణ- మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం లో అసలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేకపోయింది కానీ ఇదే జుక్కల్ నియోజకవర్గం నుంచి కొన్ని వందల కోట్ల ఇసుక మాఫియా జరుగుతుంది. ఇక్కడ జనాలు అభివృద్ధి లేక చాలా ఇబ్బందులకు గురి అవుతుంటే ఇది పట్టించుకోని అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు వారి సొంత అభివృద్ధి పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇసుక మాఫియా గురించి ప్రభుత్వ సిబ్బందికి ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా పట్టించుకోవడం లేదని ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు బాలు యాదవ్ శనివారం మండల కేంద్రంలో విమర్శలస్త్రాలు గుప్పించారు ఎందుకు అంటే అవి అధికార పార్టీ కనుసైగలో నడుస్తున్నాయి కాబట్టి అదే ఏదైనా కామన్ మ్యాన్ చిన్న తప్పు చేసిన ప్రభుత్వ రంగం వెంటనే స్పందించి వాళ్ళను జైల్లో పెట్టి శిక్ష వేయడం జరుగుతుంది కానీ ఇక్కడ జుక్కల్ నియోజకవర్గం లో అధికార పార్టీ రాజకీయ నాయకులకు ఒక న్యాయం కామన్ మ్యాన్కు ఒక న్యాయం నడుస్తుంది అంటూ విమర్శించారు ఇసుక మాఫియా పట్ల ప్రత్యక్ష పార్టీల నాయకులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రత్యక్ష నాయకులు మేలుకొని అక్రమ ఇసుక మాఫియా దందాను అడ్డుకట్ట వేయాలని ప్రజలు ఇసుక మాఫియా పట్ల అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఒక ప్రకటనలో కోరారు అధికార పార్టీ అక్రమాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎదిరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల పక్షాన వీళ్లు తమ గొంతు వినిపించాల్సిన బాధ్యత వీరి పైన ఉంటుందని ఇసుక మాఫియా అక్రమాలపై తాను మాట్లాడితే. నాపై దాడులు బెదిరింపులు అణచివేత ఒత్తిడి తప్పవు తప్పదు కానీ ఎవరూ మాట్లాడకపోతే ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడతారు వాళ్ళ బతుకులు ఎవరు బాగుపరుస్తారు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం నేను దేనికైనా సిద్ధమే అది నా సామాజిక బాధ్యత. ప్రజలు కూడా దీన్ని గమనించాలి ఆలోచించవలసిందిగా కోరుతున్నా నంటూ బాలు యాదవ్ తెలిపార ఈ కార్యక్రమంలో యువకులు కర్రేవార్ మరోతి మాదిగ.కొలవార్ పాండురంగ మాదిగ.రజన్లవార్ సందీప్ యాదవ్. సొంటిక్వార్ రాజు సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love