సర్పంచ్ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు

– నెల ఆరు రోజులకు 41 వేల 150 రూపాయలు ఆదాయం
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పరుగా గ్రామంలో గల ఆంజనేయస్వామి ఆలయ హుండీ శనివారం నాడు ఆ గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఏప్రిల్ 14 నుండి మే 20వ తేదీ వరకు ఒక నెల ఆరు రోజుల వ్యవధిలో 41 వేల 150 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆ గ్రామ సర్పంచ్ విలేకరులకు తెలిపారు. హుండీ ఆదాయం ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఆధ్వర్యంలో కేటాయించడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love