అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను..

– నాకు టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతాను.. 
– ఎవరికి టికెట్ ఇచ్చిన పని చేస్తాను
– గోషామహల్ బీజేపీ యువనేత విక్రమ్ గౌడ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
బీజేపీ పార్టీలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకు టికెట్ అడిగే హక్కు అందరికి ఉందని బిజెపి పార్టీ యువనేత విక్రమ్ గౌడ్ అన్నారు. గురువారం ఎం జె మార్కెట్ లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గోషామహల్ నియోజకవర్గంలో తన తండ్రి ముఖేష్ గౌడ్ 40 ఏళ్లుగా  చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాను ఎమ్మెల్యేగా పోటీ  చేయాలనుకుంటున్నానని చెప్పారు. తాను స్థాపించిన శ్రేష్ఠ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నాను అన్నారు. పార్టీక్రమశిక్షణకుకట్టుబడిఉంటాననిచెప్పారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన వారికి మద్దతుగా పని చేస్తానని చెప్పారు.
Spread the love