మీర్ పేట్ నల్ల పోచమ్మ ఆలయం నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా పల్లె పాండు గౌడ్ మాజీ సర్పంచ్, వైఎస్ చైర్మన్ గా కీసర గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మల వెంకటేష్, సహాయ కార్యదర్శి పెండ్యాల సంతోష్, ఉయ్యాల మణి, కార్యనిర్వాహక కార్యదర్శి పల్లె అరవింద్ గౌడ్, కోశాధికారి పెండ్యాల సత్యనారాయణ, సభ్యులు పల్లె జంగయ్య గౌడ్, ఘట్టమనేని హనుమంతరావు, ఎరుకల రాజు, రుద్రమోనియాదగిరి యాదవ్ లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ పాండు గౌడ్ మాట్లాడుతూ రాబోయే బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెండ్యాల నర్సింహ్మ, ఉయ్యాల నవీన్ గౌడ్, తీగల సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love