నవతెలంగాణ – సుల్తాన్ బజార్
మహిళల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మెడికల్అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కేశశి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా డిహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల ఆరోగ్యం పట్ల హెల్త్, గైనిక్, బెస్ట్ క్యాన్సర్ వ్యాధుల నిర్మూలన కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందన నియమని అసోసియేషన్ అభినందించారు. అధ్యక్షురాలు కే శశి శ్రీ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ క్యాంపు నిర్వహించామన్నారు. ఈ హెల్త్ క్యాంపులో గైనిక్. బెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించామన్నారు. హెల్త్ క్యాంప్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి విజయనిర్మల, కోశాధికారి స్ఫూర్తి. ఉపాధ్యక్షులు వై అనిత రెడ్డి, నిర్మల, రెడ్ క్రాస్ సొసైటీ భీమ్ రెడ్డి, క్యాన్సర్ స్పెషలిస్టులు డాక్టర్ ఆర్ముగం డాక్టర్ అర్జున్ రాజ్, డాక్టర్ గీత, షీలా రాణి రమాదేవి కల్పన మంజుల రెడ్డి డాక్టర్ లలిత రెడ్డి, సిహెచ్ లలితా రాణి, విజయలక్ష్మి, లావణ్య, నర్సు బాయి, ఓమేగాసుపత్రి, జాయ్ ఆస్పత్రి, క్యాన్సర్ కేర్ ఆస్పత్రి, వాస్వి క్ ఫౌండేషన్, డెంటల్ అసోసియేషన్ ఇండియా వారు సేవలు అందించారు. పెద్ద ఎత్తున మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.