సొంత గూటికి చేరిన కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్

– చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఎడ్ల మల్లేశ్ ముదిరాజ్.
నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ స్వతంత్ర కార్పోరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ తన సహచర నాయకులతో కలిసి సొంత గూటికి చేరారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో  తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ ముదిరాజ్ కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పోరేటర్ మల్లేష్ గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వివిధ పదవులు చేపటారు. కొద్దికాలం కిందట పార్టీని వీడిన ఆయన తాజాగా టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సారధ్యంలో మరలా మాతృ పార్టీలో చేరారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ టిడిపి మాజీ అధ్యక్షుడు, సాగర సంఘం నాయకులు వాసు సాగర్, మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బీజే వై ఎం నాయకులు రాజేష్ రెడ్డి, మీర్ పేట్ కార్పొరేషన్ ప్రజల సంఘం అధ్యక్షుడు విక్రాంత్, మున్నూరు కాపు సంఘం నాయకులు జానయ్య పటేల్, శెట్టి బలిజ సంఘం మీర్ పేట్ కార్పోరేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితర నాయకులు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. బిసీల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, అందుకే ఆ పార్టీలో చేరానని కార్పోరేటర్ మల్లేష్ ముదిరాజ్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు, టీడీపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Spread the love