– వైద్యులను అభినందించిన కార్పొరేటర్
– గోషామహల్ డివిజన్ కార్పొరేటర్ లాల్ సింగ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందిస్తున్నానని గోషామహల్ డివిజన్ కార్పొరేటర్ లాల్ సింగ్ అన్నారు. గోషామహల్ డివిజన్ లోని భరత్ కమ్యూనిటీ హాల్ లో పానీపూర క్లస్టర్ లోని మహారాజ్ గంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ చందర్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతోమందికి కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను ఉచితంగా అందజేశారు. శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు, వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి మెరుగైన చూపు కోసం కంటి అద్దాలను పంపిణీ చేసిన వైద్యులను అభినందించారు ఈ సందర్భంగా పానీపూర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి. మహారాజ్ గంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ చందర్. సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు.ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.