ఈనెల 20వ తేదీన ఉచిత హెల్త్ క్యాంప్..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఈనెల 20వ తేదీన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రాంగణంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె శశి శ్రీ తెలిపారు. ఆదివారం కోఠి లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్
పిలుపు మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19వ తేదీన తెలంగాణ మెడికల్ హ్యాండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో మహిళా ఉద్యోగులకు గైనిక్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందిస్తామన్నారు. ఈ హెల్త్ క్యాంపుకు పెద్ద ఎత్తున మహిళ ఉద్యోగులు తల్లి రావాలని పిలుపునిచ్చారు. వీటితో పాటు అందరి ఎంప్లాయిస్ కి జనరల్ హెల్త్ సర్వీసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

Spread the love