750 డ్రోన్లతో ప్రదర్శన

నవతెలంగాణ – బంజారా హిల్స్…
750 డ్రోన్లతో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర BRS పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, శంబీపూర్ రాజు, MLA లు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, వివేక్, సుభాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, సుదీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కార్పోరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, ప్రసన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, దాసోజు శ్రవణ్, వివిధ నియోజకవర్గాల ఇంచార్జి లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అద్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.  ఉత్సవాల సందర్బంగా వివిధ శాఖలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే విధంగా ప్రతిరోజు ఒక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 22 వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయని, అదేరోజున నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల జ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారని చెప్పారు.అంతకు ముందు నగరంలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్స్ పై ర్యాలీ గా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సాయంత్రం 4 గంటల వరకు చేరుకోవాలని 20 వేల మందితో అక్కడి నుండి కళాకారులు, డప్పు చప్పుళ్ళతో ర్యాలీగా అమారవీరుల జ్యోతి వద్దకు చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి అమరవీరుల జ్యోతిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సభ ముగిసిన అనంతరం అందరిని ఎంతో అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప పాలకుడు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలతో BRS పార్టీలోని నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని ఎంతో పెంచిందని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన వారిని, ఉద్యమకారులను ప్రభుత్వం ఎప్పుడు గౌరవిస్తుందని అన్నారు.

Spread the love