పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు అందజేత..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రపంచ జూనోసీస్ డే సందర్భంగా గన్ ఫౌండ్రి డివిజన్ లో పెంపుడు కుక్కలకు, వీధి కుక్కలకు ఉచితంగా ఆంటీ రెబిస్ టీకాలను ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి వెటర్నటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలు, వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం. ప్రకాష్, వెటర్నరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love