నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ చెత్తను తరలించే ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం జిల్లెలగూడలో చెత్త సేకరించడానికి వెళ్తున్న సమయంలో ఆర్సిఐ రోడ్డుపై యూ టర్న్ వద్ద చెత్త ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ పైన ఉన్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఒట్టే ఇస్తరి, అంజయ్య స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నట్లు కమిషనర్ నాగేశ్వర్ తెలిపారు.