పీర్జాదిగూడలో విద్యార్థిని అదృశ్యం

నవతెలంగాణ-బోడుప్పల్
కాలేజ్ కని వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యం అయిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ మేడిపల్లి సాయి అంజన నిలయంలో నివాసం ఉంటున్న దండేం పావని రెడ్డి (18) విజ్ణాన్ మహిళ కళాశాలలో బీ.టెక్ చదువుతుంది. ఈ నెల 23న ఉదయం 8 గంటలకు రోజు మాదిరిగానే కాలేజ్ కని వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. తోటి విద్యార్థులకు ఫోన్ చేసి అడగ్గా ఈ రోజు కాలేజీకి రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బందువుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో పావని తండ్రి పురందర్ రెడ్డి మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావని రెడ్డి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Spread the love