18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

– జిహెచ్ఎంసి అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ ఎంఎస్ శైలజ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఎ ఎం సీ) ఎంఎస్ శైలజ అన్నారు. మంగళవారం అబిడ్స్ లోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏఎంసి చాంబర్ లో ఆమె మాట్లాడుతూ.. గోషామహల్ సర్కిల్-14 పరిధిలో 235 పోలింగ్ బూతులు కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రజలు ఫామ్ -7 తో కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫామ్ -8 తో చిరునామా. పోలింగ్ స్టేషన్ బదిలీ, గుర్తింపు కార్డులో మార్పులు చేసుకోవచ్చని ఓటర్లకు సూచించారు. చనిపోయిన ఓటర్ల పేర్లను చెప్పే బాధ్యత వారి కుటుంబ సభ్యులపై ఉందని సూచించారు. సర్కిల్ పరిధిలోని ప్రజలు బి ఎల్ ఓ లకు ప్రజలు సహకరించాలని కోరారు. గోషామాల్ సర్కిల్ లో ఆరు డివిజన్ లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని ఓటర్ నమోదు పై అవగాహన కల్పిస్తామన్నారు.

Spread the love